కలసిన మనసులు 1968.
కౌముది బేనర్ పైన
ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన కలసిన మనసులు సినిమా, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1968లో విడుదలయింది. చిత్రానికి కథ, స్స్కీన్ ప్లే ఎం.ఎస్.రెడ్డి, మాటలు ఆత్రేయ, పాటలు ఆత్రేయ, దేవులపల్లి వేంకట కృష్ణమూర్తి, ఆరుద్ర, కొసరాజు.
చిత్రానికి సంగీత దర్శకులు - మాస్టర్ వేణు. గాయకులు
ఘంటసాల, సుశీల, ఎస్.జానకి, మాధవపెద్ది (పిఠాపురం? ) మంగళంపల్లి బాలమురళీకృష్ణ. శోభన్ బాబు, వాణిశ్రీ, భారతి, జగ్గయ్య, రామ్మోహన్ ముఖ్య
తారాగణం.
ఈ చిత్రం
బాక్సాఫీస్ లో ఫ్లాప్ అవడం వల్లనో లేదా ఇతర ఏ కారణం వల్లనో వీడియో అంతర్జాలంలో ఎక్కడా దొరకలేదు. ఘంటసాల,
సుశీల పాడిన యుగళగీతం - “ఒక్కక్షణం ఒక్కక్షణం ,నన్ను పలకరించకు “ అనే పాట తప్ప
ఇతర గీతాలేవీ సినిమా పాటల ప్రేమికులకు అందుబాటులోలేవు. అనుకోకుండా దేవులపల్లి
వేంకటకృష్ణ శాస్త్రిగారు రచించిన రాధికా కృష్ణ గేయం ఆడియో మాత్రం లభించింది.
చిత్రంలో ఈ పాటను ఎవరిపైన, ఎలా చిత్రించారో
తెలియదు. ఈ ఆడియోకి ఇంటర్నెట్ లో లభ్యమవుతున్న రాధాకృష్ణుల చిత్రాలతో రూపొందించిన చిన్న వీడియో ఇది.
పాట పల్లవి - అదిగో మా రాధిక
. రాధను పరిచయం చేసే గోపిక స్వరం ఎస్ జానకిదైతే, రాధగా పి. సుశీల, కృష్ణుడుగా బాలమురళీకృష్ణ స్వరాభినయం చేసారు.
గేయం చివరలో మరుజన్మలో తాను ఆ కృష్ణుడిగా పుట్టాలని, ఆ అందమైన రూపం, ముంగురులు, వేణువుతో సహా కృష్ణుడిలా మారాలని ఆశపడుతుంది
రాధిక. మరి రాధ కృష్ణుడైతే , కృష్ణుడు రాధ
కావలసిందే కదా. ‘ బెదరుకన్నులు, ఎదురుచూపులు , నిట్టూర్పులు ఈ జన్మలో అనుభవిస్తున్న రాధ
బాధనంతా మరుజన్మలో తాను అనుభవించవలసినదేనా మరి ’ అని
కొంటెగా ప్రశ్నిస్తాడు కృష్ణుడు.
చక్కని సంగీత
సాహిత్యాల మేళవింపు - అదిగో మారాధిక.
గోపిక అదిగో మా రాధిక .......
అదిగో మా రాధిక
అలవిగాని విరహబాధ నాగక............. అదిగో మారాధిక.
దెస దెసలా పరికించు ఉసురుసురని
నిట్టూరుచు
మసకసందెలో పొదల సందులో శామసుందరుని
కనలేక .....అదిగో మా రాధిక
రాధ ముసురుకొనెనూ సందెవేళా....... మూసుకొనెరా
మేఘమాలా
కడిమి పరువుల నడిమి తెరువుల
నడచిపోయే ఆలమందా
ఏలరావో నీలమోహన !! బేలరాధా ఎదురుచూచేనూ.......
కృష్ణుడు పిలిచే మురళీ.....పిలిచే మురళీ !
మారుపలుకదు నా మురళీ !
పొద పొదలో పొంచి ఉండు...... హృదయాల దాగి ఉండు
కదిలేనూ కడియాల కంకణాల రవళీ....
మురళీ.....పిలిచే మురళీ
కృష్ణుడు తెలియనీకు నెమలి పింఛమేదో
తెలియునులే
చిగురుజొంపమేదో
నీలమేఘమల్లే , నీప శాఖవోలే నీడ చూపి నిలువనీకు
రాధ మనసు మురళీ....మురళీ....పిలిచే మురళీ
రాధ ఇది హృదయం మృదుకుసుమం - ఇది హృదయం
మృదుకుసుమం
పదిలము సుమ్మీ
ప్రాణసఖా.....నా ప్రాణసఖా!
చిదిమిన చిందును బాధా మధువు
పదసన్నిధిని ఒదిగిన పూవు
పద సన్నిధిని ఒదిగిన
పూవు.....ఇది హృదయం మృదుకుసుమం.
రాధ వలచినాను నీ సొగసు
కృష్ణుడు తెలుసు నాకు నీ మనసు
వెన్న కన్న మెత్తన వెన్నెలల కన్న చల్లన
వేణుగాన లహరి కన్న రాధ మనసు తీయన ....
నా రాధ
మనసు తీయన
గోపిక మనసెరిగిన నాకే మతి పోయేనమ్మా
మా రాధను చూచి, మా మాధవునరసి
మనసెరిగిన నాకే మతి
పోయేనమ్మా
తనలోనే ఉన్న స్వామి కనపడడని రాధ
తనకై తపియించు రాధ కనుమరుగై స్వామి
మనసెరిగిన నాకే మతిపోయేనమ్మా.
రాధ మరుజన్మలో నేను మాధవుడను
కృష్ణుడు విరహవేదన వేగు రాధనా నేను
రాధ చిరునవులు ముంగురులు మురళీ నావి
కృష్ణుడు వెదకు కన్నులు వేడి నిట్టూరుపులు
నావి......అవునా.
రాధ ఊ....
1 comment:
Very nice really amazing post thank for this.
Latest Bollywood Gossip in Telugu
తెలుగులో బాలీవుడ్ వార్తలు
Post a Comment